చెన్నైకు చెందిన ఈ చిన్నది సుమారు 20 ఏళ్లుగా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ ఎందుకో గానీ ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. పై ఫొటోలో తెల్ల గౌను ధరించి ఏంజెల్ లా మెరిసిపోతోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2005లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ దాదాపు 40కు పైగా సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ మెరిసింది. అయితే ఎందుకో గానీ ఇప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోయింది. ఇప్పుడు కూడా సినిమాలు బాగా తగ్గించేసింది. నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. మరీ ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ జానర్ లకు సంబంధించిన లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అంతే కాదు కొన్ని సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేస్తోంది. మరి ఇంతకు ఆ నటి ఎవరో గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు రెజీనా కాసాండ్రా. గురువారం (డిసెంబర్ 13) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. 33 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంటోంది రెజీనా. ప్రస్తుతం మూడు హిందీ, ఓ తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటోందీ అందాల తార .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here